అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడిగా అనిరుధ్ గుప్త
ముషీరాబాద్ (విజయక్రాంతి): అగర్వాల్ సమాజ్ తెలంగాణ(Agarwal Samaj Telangana) రాష్ట్ర నూతన అధ్యక్షులుగా అనిరుధ్ గుప్తా, ఉపాధ్యక్షులుగా రూపేష్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శిగా వికాస్ కుమార్ కేశన్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ సీమా జైన్, కోశాధికారిగా అచల్ గుప్తా ఎన్నికైనట్లు అగర్వాల్ సమాజ్ ఎన్నికల అధికారి డాక్టర్ మోహన్ గుప్తా(Officer Dr. Mohan Gupta) ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థులందరిని టీమ్ ఏకె సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు.
నూతన అధ్యక్షులు అనిరుధ్ గుప్తా మాట్లాడుతూ... మహారాజా అగ్రసేన్ జీ ఆదర్శాలు, సూత్రాలను అనుసరిస్తూ సామాజిక సంక్షేమ పనిని దృఢ సంకల్పంతో నిర్వహిస్తామని తెలిపారు. సాంస్కృతిక వారసత్వం, దాతృత్వానికి మరోపేరైనా అగర్వాల్ సమాజాన్ని బలోపితం చేయడంతో పాటు సమాజంలో సోదరభావం, స్నేహ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ధార్మిక, విద్యా వ్యాప్తి, సామాజిక సమానత్వం కోసం అగర్వాల్ సమాజ్ తెలంగాణ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.






