23 August, 2026 | 2:45 AM

సుస్మిత అనుచిత వాఖ్యలు

23-08-2026 12:59 AM
  1. ఆమె మాట్లాడిన వీడియోలను పరిశీలించాం
  2. చిన్నారెడ్డి వివరణనూ పరిశీలించాం
  3. రాజ్‌గోపాల్‌రెడ్డిపై ఫిర్యాదు అందలేదు
  4. ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి) : కొండా సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు పరిశీలించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. పార్టీకి, ము ఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటామో ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే కూతు రు చేసిన వ్యాఖ్యలను కనీసం మంత్రిగా అ యినా కొండా సురేఖ ఖండించాల్సి ఉండగా, తనకు సంబంధం లేదంటున్నారని మల్లు రవి పేర్కొన్నారు. శనివారం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

మంత్రి కొండా సురేఖ ఇచ్చి న వివరణ కూడా చూశామని, కొంతమంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి రీపోర్ట్ ఇస్తామని చెప్పారని, అందరూ ఇచ్చిన ఫిర్యాదు లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడిన మాటలు, వీడియోలను కూడా పరిశీలించి నట్లు మల్లు రవి తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి నుంచి మరోసారి వివరణ కోరుతామని పేర్కొన్నారు.

పార్టీకి అందరూ సమానులే..

పార్టీ లైన్‌దాటితే సహించబోమని, అంద రూ సమానమేనని మల్లు రవి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో పొలిటికల్ ఎఫెక్స్ కమిటీ సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డికి జరిగిన వివాదంపై ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి నుంచి కూడా వివరణ తీసుకున్నామని పేర్కొన్నారు. జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. సస్పెండ్ తర్వాత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఎల్‌బినగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మధుయాష్కిపై అనుచిత వాఖ్యలు చేశారన్నారు.

గాంధీభవన్ వేదికగా అనుచరులతో ఆయన గొడవకు దిగారని గుర్తు చేశారు. సిద్దిపేట, గజ్వేల్‌లో వివాదాలపై కూడా వివరణ కోరామని తెలిపారు. ఇక మునుగో డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తామని, అయితే ఆయనపై ఎలాంటి ఫిర్యాదు లు తమకు అందలేదన్నారు. సుమోటోగా తీసుకోవాలా.. లేదా? అనేది పరిశీస్తున్నామని మల్లు రవి స్పష్టం చేశారు.