విద్యార్థి అనుమానాస్పద మృతి
ఇంటర్ పరీక్ష రాసి అదృశ్యం
కాల్వలో మృతదేహంగా లభ్యం
బిచ్కుంద, మార్చి 7 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాసిన ఓ గురుకుల విద్యార్థి గురువారం అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత కాల్వలో శవమై తేలిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో చోటు చేసుకుంది. బిచ్కుంద మైనార్టీ గురుకుల కళాశా లలో ముజాహిద్(16) ఇంటర్మీడియట్ ప్రథ మ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5న ఇంటర్మీడియట్ పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన తరువాత స్నేహితులుతో కలిసి వెళ్లాడా లేక ఒంటరిగా వెళ్లాడా విషయాలు తెలియ రాలేదు.
విద్యార్థి మాత్రం కనిపించకుండా పోయాడు. దీంతో మైనార్టీ గురు కుల కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. శనివారం ముజాహిద్ మృతదేహం చిన్నదడిగి నుంచి పెద్దదడ్గి గ్రామం సమీపంలోని కౌలాస్ నాలా కాలువ గుంత లో కనిపించింది. ఈ నెల 5న పరీక్ష రాసిన తర్వాత పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపానికి గురై తిరిగి కళాశాలకు వెళ్లకుండా నడుచుకుంటూ చిన్నదాడికి వెళ్లే మార్గంలో ఉన్న కవుల స్నానాలు దూకి, ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుని మామ బందే నవాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిచ్కుంద పోలీసులు తెలిపారు.




