calender_icon.png 25 January, 2026 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి కానుకగా స్వయంభు

25-01-2026 12:42:29 AM

బ్లాక్‌బస్టర్ సినిమా ‘కార్తికేయ2’తో దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్ ఇప్పుడు తన 20వ చిత్రం ‘స్వయంభు’తో ప్రేక్షకులను రాబోతున్నారు. ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్‌కి భరత్ కృష్ణమాచారి దర్శ కత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయను న్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తన కెరీర్‌లో తొలిసారి తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కావటంతో నిఖిల్ ఇందులోని తన పాత్ర కోసం పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఈ చిత్రానికి డీవోపీ: సెంథిల్ కుమార్; సంగీతం: రవి బస్రూర్; యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా; సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి; డైలాగ్స్: విజయ్ కామిశెట్టి; ఎడిటర్: తమ్మిరాజు; ప్రొడక్షన్ డిజైన్: ఎం ప్రభాహరన్, రవీందర్.