తీపి జ్ఞాపకాలు
02-12-2024 12:00 AM
కుర్చీని మడత పెట్టి..
ఆనాటి ఆకట్టుకునే వస్తువుల్లో మడత కుర్చీ ఒకటి. తెలంగాణలో దీనిని ‘ఆరాం కుర్చీ’ అని పిలిస్తే.. ఆంధ్రాలో ‘పడక కుర్చీ’గా సుపరిచితం. ఆ రోజుల్లో పెద్దోళ్లు ఏ పొలం పనులకో, ఇతర అత్యవసర పనులకో బయటికి వెళ్లి బాగా అలసిపోయినట్టు భావిస్తే వెంటనే మూలకున్న మడత కుర్చీని వేసేసి అందులో సేదతీరేవారు. అయితే నేటికీ పల్లెల్లో ఈ మడత కుర్చీలు దర్శనమిస్తుండటం విశేషం.
మట్టి కుండలే మహాఔషధం
కొన్ని ఆహార పదార్థాలకు అంత రుచి ఎందుకొస్తుందో తెలుసా.. అవి మట్టి కుండల్లో వండుతారు కాబట్టి. అందుకే మన పూర్వీకులు మట్టి కుండలను ఎక్కువగా వాడేవారు. ప్రస్తుతం రాగి, ఇత్తడి, స్టీల్ లాంటి పాత్రలున్నా.. ఈతరంవాళ్లు మట్టి కుండలనే వా డటానికి మొగ్గు చూపుతున్నారు.




