భారీ లాభాల పేరిట కుచ్చుటోపీ
విప్స్ గ్రూప్ నిర్వాకం
అలువురు ఏజెంట్ ల అరెస్ట్, పరారీలో మరికొందరు
వివరాలు వెల్లడించిన ఏఎస్పి
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 12: ఆధిక లాభాలు, కాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను నమ్మించి వందల కోట్ల పెట్టుబడులు పెట్టిం చి, పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన విప్స్ గ్రూప్ అఫ్ కం పెనీస్ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.
2016 సంవత్సరంలో పుణె నగరo, మహారాష్ట్ర రాష్ట్రంకు చెందిన వినోద్ తుకారాం ఖుటే విప్స్ వర్చ్యువల్ ఇంటలిజెన్స్ పేమెంట్ సిస్టం అనే వాలెట్ యాప్ ను ప్రారంభించాడు. 2018లో ఈ సంస్థను విప్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ గా మా ర్చి, వివిధ రకాల సేవల పేర్లతో ఆధిక లాభా లు, కాష్ బ్యాక్ ఆఫర్ అంటూ ఆన్లైన్ లో వి స్తృతముగా ప్రచారం చేసి, తన ఏజెంట్ల, ఎగ్జిక్యూటివ్, సీనియర్-ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, డవెలప్మెంట్ డైరెక్టర్ లు ద్వారా కొన్ని వందల కోట్ల పెట్టుబడులు పెట్టించి, వారికి పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా నమ్మిoచి మోసం చేశారు.
మోడస్ ఆపరండి పేరుతో సభ్యత్వ రుసు ము రూ.1,995 వసూలు చేసి, వారికి రూ.2,000 షాపింగ్ పాయింట్లు, మొత్తం నగదు తిరిగి వచ్చే వరకు రోజుకు 7 రాబడి ఇస్తామని హామీలతో డబ్బులు వసూల్ చే శారు, కానీ ఇవ్వలేదు. కమిషన్ వ్యవస్థ పే రుతో, మీ క్రింద ముగ్గురిని జాయిన్ చే యండి, వారి క్రింద మరో ముగ్గురిని జాయి న్ చేయాలి, అలా చైన్ సిస్టమ్ 5 స్థాయిల వరకు మల్టీ-లెవల్ కమిషన్ వస్తుంది 1లెవల్-20 శాతం, 2లెవల్ 5 శాతం, 3లెవల్ 2.5శాతం, 4లెవల్ 1.25శాతం, 5లెవల్ 1.25శాతం కమిషన్ డబ్బులు వస్తాయి అని డబ్బులు వసూల్ చేశారు, ఏళ్ల ఇవ్వలేదు.
విప్స్ ట్రేడింగ్ పేరుతో రూ.10వేలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయమని ప్రేరేపించి, నెలకు 3 -5 శాతం రాబడి ఇస్తామని హామీ ఇచ్చి, అధిక మొత్తంలో డిపా జిట్ చేయించుకొని ఇవ్వలేదు. విప్స్ ప్రాపర్టీస్ పేరుతో, తమ కంపెనీ చెప్పిన స్థలాలను కొంటె, 100 నెలలలో 10 0 శాతం క్యాష్బ్యాక్ ఇస్తామని భరోసా ఇచ్చి స్థలాలను కొనిపించి, వారికి డబ్బులు తిరిగి ఇవ్వలేదు.
మార్చంట్ క్యూ ఆర్ వ్యవస్థ పేరుతో దుకాణాలను క్యూ ఆర్ కోడ్తో నమోదు చేసి, క్యాష్బ్యాక్ను కంపెనీ, దుకాణ యజమాని, కస్టమర్ మధ్య పంచుకునే విధానం లో డబ్బులు వసూల్ చేసినారు, కానీ ఇవ్వలేదు. పై విధంగా విప్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత వినోద్ తుకారాం ఖుటే అతని ఏజెంట్లు అందరూ కలిసి కుట్ర పన్ని వివిధ పథకాల పేరుతో డబ్బు సర్క్యులేషన్ పిరమిడ్ స్కీమ్ గా సృస్టించి, కొత్త సభ్యుల చేర్పుపై లాభాలు ఉంటాయి అని మాయమాటలు చెప్పి, మోసగించారు.
నిజమైన వ్యాపార కార్యకాలాపాలు లేవుఅని అసాధ్యమైన అధిక రాబడులు హామీల పేరుతో ప్రజలను నమ్మిoచి మోసం చేసినట్లు వివరించారు శనివారం నల్లగొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్ సమీపంలో కలిసి వేవ్ అనే కొత్త కంపెనీలో పాత కస్టమర్లు మళ్లీ 1, లక్ష పెట్టుబడి పెడితే, పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని చెప్పి మళ్లీ మోసం చేయాలని యత్నించారు.
ఈ సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్టు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కానాల లక్ష్మినారాయణ రావు ( వనస్థలిపురం, హైదరాబాద్.) పున్నం బాలకృష్ణ (మర్రూర్ గ్రామం, నకిరేకల్ మండలం.) ఉయ్యాల శ్రీనివాస్ (ఏలికట్టే గ్రామం, చిట్యాల మండలం.) కురాకుల రమేష్ (నల్గొండ పట్టణం.) గాజుల మహేష్ (దోరేపల్లి గ్రామం, కనగల్ మండలం.)
కోల కుశలయ్య (కాకుల కొండారం గ్రామం, నల్గొండ మండలం.)మాదగొని సైదులు ( శ్రీరామ్ నగర్ కాలనీ, నల్గొండ పట్టణం.)ముడుసు ఉమా శంకర్ ( మునుకుంట్ల గ్రామం, కట్టంగూర్ మండలం.) ఓరుగంటి శంకర్ (అప్పాజీపేట గ్రామం, నల్గొండ మండలం.)గుడపూరి లింగస్వామి @ గూడూరు అఖిల్ కట్టంగూర్ మండ లం.) ఉన్నారు.
అలాగే వినోద్ తుకారాం ఖుటే (సీఈఓ , విప్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ )సుమిత్ పురాంక్ డైరెక్టర్‌కల్యాణ్ చక్రవర్తి సౌత్ ఇండియా డెవలప్మెంట్ డైరెక్టర్ గుమ్మ ల సత్యనారాయణ డైరెక్టర్ గుమ్ముల అభినాష్ డైరెక్టర్ లు పరారీలో ఉన్నట్లు తెలి పారు. కేసును చేదించిన డిఎస్పీ శివరాం రె డ్డి, నల్గొండ టూ టౌన్ సిఐ వి. రాఘవ రావు, నల్గొండ రూరల్ ఎస్‌ఐ సైదా బాబు, సిబ్బందిని అభినందించారు.




