చలివేంద్రాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
గరిడేపల్లి, ఏప్రిల్ 12: చలివేంద్రాన్ని గ్రామ ప్రజలు, పాదాచారులు సద్వినియోగం చేసుకోవాలని కల్మల్ చెరువు గ్రామ సర్పంచ్ బ చ్చలకూరి శ్రీను,కమిటీ అధ్యక్షుడు నాగయ్య అన్నారు. ఆదివారం గ్రామఅభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ తరుణ్ కార్ డ్రైవింగ్ స్కూల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వారు పాల్గొని ప్రారంభించారు.
కమిటీ సభ్యుల చేతుల మీదుగా చల్లటి మంచినీళ్లతో పాటు జ్యూస్ పంపిణీ చేసి గ్రామస్తుల దాహాన్ని తీర్చారు.అనంతరం మాట్లాడుతూ...నేడు రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి ఇక్కట్లను గుర్తించి సంచార ప్రాంతాలలో వారి దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పా టు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకట రమణారెడ్డి, కమిటీ ఫౌండర్ బచ్చలకూరి నాగ శేఖర్,కమిటీ ప్రెసిడెంట్ బచ్చలకూరి నాగయ్య, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.




