4 July, 2026 | 1:01 AM

చరిత్ర సృష్టించిన స్విట్జర్లాండ్

04-07-2026 12:08 AM

తొలిసారి ప్రీ క్వార్టర్స్‌లోకి ఎంట్రీ

వాంకోవర్, జూలై 3: సాకర్ ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ చరిత్ర సృష్టించింది. 90 ఏళ్ల తమ ఫుట్ బాల్ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశలో విజయాన్ని అందుకుంది. రౌండ్ ఆఫ్ 32లో అల్జీరియాపై 20 తేడాతో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి 10 నిమిషాల్లోనే బ్రీల్ ఎం బోలో గోల్ చేసి ఆధిక్యంలో నిలిపాడు.

సెకండాఫ్ ఆరంభంలో డాన్‌న్డోయే మరో గోల్ సాధిం చి స్కోరు 20కి పెంచాడు. తర్వాత అల్జీరియా ఎంత పోరాడినా స్విస్ డిఫెన్స్ ను ఛేదించలేకపోయింది. ఈ విజయంతో స్విట్జర్లాండ్ ప్రపంచ కప్ నాకౌట్ దశలో తమ వైఫల్యాలకు తెరదించినట్టయింది. ప్రీ క్వార్టర్స్‌లో కొలంబియా- ఘనా మ్యాచ్ విజే తతో ఆ జట్టు తలపడుతుంది.