29 April, 2026 | 5:45 PM

తాడూరు అంగన్వాడిలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం

29-04-2026 03:41 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరులోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం బాల బాలికలకు సైబర్ క్రైమ్, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ లింక్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ... పిల్లలు, యువత సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆన్లైన్ గేమ్స్, అనుమానాస్పద లింక్స్ వలన మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.పిల్లలు మొబైల్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, తెలియని లింక్స్‌ను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని ఆమె వివరించారు.