calender_icon.png 31 July, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులపై తహశీల్దార్లు దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలి

30-07-2025 09:14:09 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్..

గద్వాల టౌన్: గద్వాల జిల్లా పరిధిలో భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై తహశీల్దార్లు దృష్టిసారించి వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(District Collector B.M. Santosh) తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ సమావేశపు హాలులో భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై తహశిల్దార్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ లతో మండలాల వారీగా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించి వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు.

భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన సక్సేషన్, పెండింగ్ మ్యుటేషన్, పిఓపి, డి.ఎస్. పెండింగ్  అన్ని దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులు పరిష్కారంలో  వేగం పెంచాలని ఆదేశించారు. వచ్చేవారం చేపట్టిన చర్యలపై తిరిగి సమీక్షించడం జరుగుతుందని  తెలిపారు. మీసేవ ద్వారా వచ్చే బర్త్, డెత్, ఆదాయ, రెసిడెన్సు, యాఫ్ - లైన్ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని తహసీల్దారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ, ఆర్.డి.ఓ. అలివేలు, ఏఓ భూపాల్ రెడ్డి, తహశీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.