25 August, 2026 | 3:43 AM

ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

25-08-2026 01:03 AM

రంగారెడ్డి, అగస్టు24(విజయక్రాంతి): నగర శివార్లలో కబ్జాలకు గురవుతున్న అసైన్మెంట్ భూములను కాపాడాలని, ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కుంటలను సంరక్షించాలని నగర ప్రజలు హైడ్రాను కోరారు. సోమవారం నిర్వహించిన ‘హైడ్రా ప్రజావాణి’ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి మొత్తం 47 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, అడిషనల్ కమిషనర్ డి. ఆనంద్‌కుమార్.. వాటిని పరిశీలించి తక్షణమే తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.