16-10-2025 12:00:00 AM
ములుగు, అక్టోబరు 15 (విజయక్రాంతి) : ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి, సంజోష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన సినీనటులు సంజోష్ హరి మరియు హైకోర్టు అడ్వకేట్, దిశా లా ఫర్మ్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావుతో కలిసి ఉచిత కంటిపొర చికిత్సకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 30వరకు ములుగు జిల్లా ఏటూరునాగారంలోని గిరిజన భవన్ లో ఉపేంద్ర రాచుపల్లి మరియు శిల్ప సహకారంతో సంజోష్ ఫౌండేషన్ స్థాపకుడు యాక్టర్ సంజోష్, శంకర నేత్రాలయ మెసు (MESU), చెన్నై వారు సంయుక్తంగా ఏటూరునాగారంలోని గిరిజన భవన్ లో ఉచిత కంటి పొర చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నారని తెలియజేశారు.
జిల్లా ఎస్పీ ఈ సేవా కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ, గ్రామీణ ప్రజలకు ఈ మొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిరం ఎంతో మేలు చేస్తుందని తెలియజేశారు. ఉచిత చికిత్స శిబిరమును నిర్వహిస్తున్న సినీ నటుడు సంజోష్‌ను జిల్లా ఎస్పీ అభినందించారు.