calender_icon.png 22 February, 2026 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీ‘జులుం’కు కట్టడి?

22-02-2026 01:01:23 AM

ఇంజినీరింగ్ కాలేజీలకు సర్కారు ఝలక్!

సగం కాలేజీల్లో ఫీజుల నియంత్రణ

70 కాలేజీల్లో పాత ఫీజులే

మరో 19 కాలేజీల ఫీజుల్లో కోత

కాలేజీల ర్యాంకుల ఆధారంగా ఫీజుల ఖరారు

ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ కాలేజీలకు రాష్ట్ర ప్రభు త్వం ఝలక్ ఇచ్చింది. కాలేజీల్లోని విద్యాప్రమాణాలు, వసతులు, ఫ్యాకల్టీ అంశాలను పరిగణలోకి తీసుకునే ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేయనుంది.  అనుకున్న ట్టుగానే పలు కాలేజీల్లో ఇంజినీరింగ్ ఫీజు ల్లో కోత విధించింది. దీంతో కొన్ని కాలేజీల్లో మాత్రమే ఫీజులు పెరగనున్నాయి.

ఈ విద్యా సంవత్సరంతో పాటు బ్లాక్  పిరియడ్ (2025 మొత్తం ఈ ఫీజులే ఖరారు కానున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం విడు దల చేయనుంది. ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఈ కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. 2025 2026 2027 విద్యాసంవత్సరం వరకు ఇవే అమలుకాన్నాయి. ఈ ఫీజులు ఇప్పటి వరకు  ఫైనల్ కాకపోవడంతో 2025 విద్యాసంవత్సరానికి విద్యార్థుల నుంచి ప్రస్తుతం పాత ఫీజులనే వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

ర్యాంకుల ఆధారంగా..

రాష్ట్ర వ్యాప్తంగా 157 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. అయితే వీటిలోని ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపును సాధ్యమైనంత వరకు సర్కారు కట్టడి చేసింది. రాష్ట్ర వ్యా ప్తంగా 70 కాలేజీల్లో గతంలోని పాత ఫీజులనే యథాతథంగా 2027 వరకు కొన సాగించాలని నిర్ణయించింది. మరో 19 కాలేజీల్లో గత బ్లాక్ పిరియడ్‌కు సంబంధించిన ఫీజుల్లో కోత విధించి స్వల్పంగా ఫీజులు తగ్గించారు. ఇంకా 63 కాలేజీల్లో మాత్రం ఫీజులను పెం చారు.

మిగిలిన ఐదు కాలేజీలు ఫీజు ల పెంపునకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదు. కాగా, గతేడాది నుంచే ఇంజినీరింగ్ కాలేజీలకు ఈ బ్లాక్ పిరియడ్ కోసం కొత్త ఫీజులను టీఏఎఫ్‌ఆర్సీ (తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) ఖరారు చేయా ల్సి ఉంది. ప్రైవేట్ కాలేజీల ఆదాయ, వ్య యాలు, పాటించే విద్యాప్రమాణాలు, కాలేజీల్లో ఉండే వసతులు, సౌకర్యాలు,

ల్యాబ్ లు, ఫ్యాకల్టీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని టీఏఎఫ్‌ఆర్సీ ఫీజులను నిర్ణయించి ప్రభుత్వానికి నివేదికను పంపించాలి. అయి తే ఆయా కాలేజీల ఫీజులను పెంచుతూ నివేదికను ప్రభుత్వానికి టీఏఎఫ్‌ఆర్‌సీ గతంలో నే  పంపించింది. ఫీజులు భారీగా పెంచారని భావించిన ప్రభుత్వం టీఏఎఫ్‌ఆర్సీపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ మరోసారి విద్యాప్రమాణాలకు అనుగుణంగా ఫీజులుండేలా నిర్ణ యించాలని పేర్కొంది.

అంత వరకూ పాత ఫీజులే ఉంటాయని ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. విద్యాసంవత్సరం కూడా ప్రా రంభం కావడంతో అప్పట్లో దీనిపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు పోవడంతో ఫీజులను ఖరారు చేయాలని ప్రభు త్వానికి న్యాయస్థానం ఆదేశించింది.

ఈ క్ర మంలోనే కాలేజీల ఫీజులను మరోసారి విద్యాప్రమాణాలను బట్టి నిర్ణయిస్తూ ప్రభుత్వానికి గతేడాదిలోనే నివేదిక పంపింది. దీంతో సగం కాలేజీల ఫీజులను కోత విధి స్తూ, సగం కాలేజీల్లో పెంచింది. దీనిపై అధికారికంగా జీవో విడుదల కావా ల్సి ఉంది. దీనిపైన కూడా ఫీజులు తగ్గిన కాలేజీలు కోర్టుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. 

లక్షకు పైగా ఫీజులున్న కొన్ని ప్రముఖ కాలేజీలు 

సీబీఐటీ లక్షలు, వాసవి లక్షలు, ఎంజీఐటీ లక్షలు, సీవీఆర్ లక్షలు, నారాయణమ్మ రూ.1.62, గోకరాజు గంగరాజు  లక్షలు, వీఎన్‌ఆర్ రూ.1.59 లక్షలు, బీవీఆర్‌ఐటీ లక్షలు, వర్ధమాన్ రూ.1.40 లక్షలు, ఎస్‌ఆర్ లక్షలు, ఎంవీఎస్‌ఆర్ శ్రీనిధి లక్షలు, గురునానక్ విజ్ఞాన్ రూ.1.23 లక్షలు.

ఫీజు సవరణలు ఇలా...

మొత్తం కాలేజీల్లోని 28 కాలేజీల్లో ఫీజు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉంది. ఏడు కాలేజీల్లో మాత్రం రూ.1.50 లక్షలకు పైగా ఉంది. 64 కాలేజీల్లో రూ.50 వేలు నుంచి రూ.లక్ష మధ్య ఉంది. 40 కాలేజీల్లో రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. 18 కాలేజీల్లో రూ.50 వేల లోపు ఫీజులున్నాయి. 35 కాలేజీల్లో రూ.పది వేల కంటే తక్కువ ఫీజు పెరిగింది. అయితే కావాలనే కొన్ని కాలేజీల్లో ఫీజులు తగ్గించారనే ఆరోపణలూ ఉన్నాయి.