07-06-2025 04:35:17 PM
లైన్స్ క్లబ్ డిఎంటి కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు..
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి పట్టణ కేంద్రంలోని రిటైర్డ్ టీచర్ విశ్రాంతి భవనంలో సోమవారం ఉదయం 9 గంటలకు సూర్యాపేట ఐ లైన్స్ క్లబ్, తుంగతుర్తి లైన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు లైన్స్ క్లబ్(Lions Club) డిఎంటి కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు(Gudipudi Venkateswara Rao) అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... తుంగతుర్తి మండలంలో నూతన లైన్స్ క్లబ్ మెంబర్షిప్ కోసం మండలంలోని ఆసక్తి గలవారు, సమాజానికి సేవ చేయదలచిన వారు ఆధార్ కార్డ్, 2 పాస్పోర్టు ఫోటోలతో, తుంగతుర్తి లైన్స్ క్లబ్ మెంబర్ విశ్రాంతి ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు పాలవరపు సంతోష్ ను సంప్రదించాలని ఆయన కోరారు.
ఉచిత కంటి వైద్య శిబిరంలో ఉచిత పరీక్షలతో పాటు సూర్యాపేట లైన్స్ క్లబ్ లో ఆపరేషన్ సౌకర్యం కలగని తెలిపారు. ఈ అవకాశాన్ని తుంగతుర్తి మండల పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సెక్రటరీ ఉప్పుల రాజేంద్రప్రసాద్, జోన్ చైర్ పర్సన్ కొండపల్లి లక్ష్మారెడ్డి, రీజనల్ చైర్ పర్సన్ కొండా సంతోష్ ,సభ్యులు పులుసు వెంకన్న ,ఓరుగంటి సుభాష్, ఓరుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.