ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సై బాలకృష్ణ
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే 2: జిల్లా యువజన క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో మరియు బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని చిన్నారులు,క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని అర్వపల్లి ఎస్త్స్ర బాలకృష్ణ కోరారు.శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలోని జడ్పీహెచ్‌ఎస్ లో వేసవి ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని పీడీ మల్లేష్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని,నేటి నుంచి జూన్ 6 వరకు జరిగే వివిధ క్రీడాంశాల్లో కోచ్ ల పర్యవేక్షణలో మెలకువలు నేర్చుకుని మండల,జిల్లా,రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో మండలం పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఇట్టి వేసవి సెలవులను విద్యార్థులు ప్రణాళికలతో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ రాములు,పీడీలు యాదయ్య,విజయ్ కుమార్,సరిత,ఉపాధ్యాయులు కోటమర్తి వీరన్న,బిందులత,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






