10 March, 2026 | 2:04 PM

స్కూల్ బస్సు ఢీకొని వివాహిత మృతి

18-09-2025 12:46 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తాండూర్ మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన ఫీట్ల మారుతి, పోగుల నానక్క బుధవారం రేచిని గ్రామంలో యూరియా బస్తా పంపిణీ చేస్తున్నారని తెలిసి తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రెబ్బెన మండలం కిష్టాపూర్ నుండి తాండూర్ ఐబి వైపు వస్తున్న సెయింట్ థెరిస్సా స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మారుతి, నానక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. మారుతి కాలు విరగగా, తీవ్రంగా గాయపడ్డ నానక్క ను బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం నానక్కను కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. నానక్క భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.