17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

29-03-2025 12:54 AM

కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మ గోని లక్ష్మీ రాజా గౌడ్

కామారెడ్డి, మార్చి 28 (విజయ క్రాంతి), రైతులు ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్ కోరారు. శుక్రవారం కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన పశువులు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కామారెడ్డి మండల పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశు వైద్యాధికారులు గోపాలమిత్ర ప్రతినిధులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా పశువులకు అవసరమైన మందులను చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు.

ఈ పశు వైద్య శిబిరంలో పశు వైద్యులు రవికిరణ్ , అనిల్ రెడ్డి గోపాలమిత్రలు కలిసి చికిత్స లు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  ధర్మగొని లక్ష్మీరాజాగౌడ్ , వైస్ చైర్మన్  మినుకూరి బ్రహ్మానందరెడ్డి, డైరెక్టర్లు సుదర్శన్ రావు, వలిప్శెట్టి లక్ష్మీరాజమ్, దోమకొండ శ్రీనివాస్, మక్బుల్, రాజలింగం, గ్రేడ్ 3 సెక్రటరీ దర్శింగ్ , మార్కెట్ కమిటీ సిబ్బంది, పశువైద్యాధికారులు, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.