calender_icon.png 2 December, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాత్రానందం సర్వీసును సద్వినియోగం చేసుకోండి

02-12-2025 04:57:54 PM

నిర్మల్ (విజయక్రాంతి): భక్తుల సౌకర్యం కోసం టీజీ ఆర్టీసీ యాత్రానందం సర్వీస్ లను నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. మంగళవారం ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి అరుణాచలంకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. మరుసటి రోజు ఉదయం కాణిపాకం వర సిద్దివినాయకుణ్ణి దర్శించుకొని అరుణాచలం వెళ్తుంది. అరుణాచలంలో దర్శనం గిరి ప్రదక్షిణ చేసుకొని 4వ తేదీ రోజు తిరుపతి చేరుకుంటుంది.

5వ తేదీ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం బయలుదేరి 6వ తేదీ జోగిలాంబాను దర్శనం చేరుకొని నిర్మల్ కు చేరుకుంటుంది. డిసెంబర్ 3వ తేదీ రోజు అరుణాచలంలో కార్తీక జ్యోతి వెలుగుతుంది. కావున నిర్మల్ మండలం అక్కాపూర్ ఒకే గ్రామం నుండి 35 మంది ప్రయాణికులు ఈ బస్సును బుక్ చేసుకోవడం గమనార్హం. ఇలాగే ఏ గ్రామానికైనా 30 మందికి పైగా ప్రయాణికులు ఉంటే మీరు కోరుకున్న బస్సు సౌకర్యం కలిపిస్తామని డిపో మేనేజర్ కే పండరి తెలిపారు. బస్సులో బయలుదేరుతున్న ప్రయాణికులకు డిపో మేనేజర్ శుభాకాంక్షలు తెలిపారు.