02-12-2025 04:39:41 PM
సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం..
నామినేషన్ దాఖలు చేసిన పెద్దదర్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి శిరీష తేజవర్ధన్..
హన్వాడ: సమగ్ర గ్రామ అభివృద్ధి కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని పెద్దదర్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి శిరీష తేజ వర్ధన్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల కేంద్రంలో గ్రామ ప్రజల సమక్షంలో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని, సేవ చేసే అవకాశం తమకు ఇవ్వాలని పేర్కొన్నారు. మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఓటర్లందరూ తమను దీవించాలని విన్నవించారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ ప్రజలు అందరూ మెచ్చేలా అభివృద్ధి చేసుకుందామని కోరారు. గ్రామ సభ్యుల సూచనలను సలహాలను తీసుకుంటూ అభివృద్ధివైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికే గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తున్నారని వారి సలహాలు సూచనల మేరకే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారని పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి మద్దతు తెలియజేస్తూ నామినేషన్ వేసేందుకు విచ్చేసిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.