3 June, 2026 | 1:48 AM

అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోండి: సీపీ తరుణ్ జోషి

03-06-2026 12:00 AM

షాద్‌నగర్, జూన్ 2 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. మంగళవారం ఆయన షాద్నగర్ టౌన్, కొత్తూర్ పోలీస్ స్టేషన్లను సందర్శించి పనితీరును సమీక్షించారు.

ప్రజల ఫిర్యాదులపై పోలీసులు సత్వరమే స్పందించాలని, క్రిమినల్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. బీట్ పోలీసింగ్ను బలోపేతం చేయడంతో పాటు, గ్రామ పోలీస్ అధికారులు స్థానిక సమాచారాన్ని సేకరిస్తూ అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, స్థానిక సీఐలు, ఎస్త్స్రలు పాల్గొన్నారు.