3 June, 2026 | 1:47 AM

మిత్రుని కుటుంబానికి అండగా..

03-06-2026 12:00 AM

బచ్చన్నపేట జూన్ 2 విజయక్రాంతి: మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్ల మల్లయ్య కుమారుడు నల్ల వెంకటేష్. ఇటీవల జరిగిన ఘోర  రోడ్ ప్రమాదంలో  మృతి చెందిన సంఘటన తెలుసుకొని  ,తోటి మిత్రునికి ఆపద సమయంలో అండగా ,ఆర్థికంగా  ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో 1987-88 ఎస్‌ఎస్సి బ్యాచ్ చెందిన విద్యార్థులు.

తమ  మిత్రుని స్వగ్రామం బసిరెడ్డి పల్లి గ్రామానికి  వెళ్లి పరామర్శించి ,ఆర్థిక సహకారం అందించి ,ఆ కుటుంబాన్ని మేమున్నామంటూ మనో ధైర్యాన్ని నింపి. ఓదార్చారు.   ఈ కార్యక్రమంలో అంజయ్య ,నరేందర్ రెడ్డి చంద్రశేఖర్ రావు. రాజు శ్రీనివాస్ నర్సింహులు భాస్కర్ నర్సింహ శివకుమార్ రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు