కాంగ్రెస్ హయాంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి
బోథ్, మే 29( విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను పేదలకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని మాజీ ఎంపీ సోయం బాబురావు పిలుపునిచ్చారు శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏర్పాటుచేసిన వ్యాపార దుకాణాన్ని ప్రారంభించారు.
అనంతరం పార్టీ నాయకులు అచ్యుతానంద రెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అవి అట్టడుగు వర్గాల ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలు పార్టీ నాయకులు గ్రామస్థాయిలో పార్టీని బలం చేస్తూ సంక్షేమ పథకాలు చేరే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ ఫ్యాక్స్ డైరెక్టర్ చట్ల ఉమేష్ డిసిసి అధికార ప్రతినిధి పి చంటి లు మాజీ ఎంపీ ని సన్మానించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎల్ పోశెట్టి దన్నూర్ కుచలాపూర్ గ్రామాల సర్పంచ్లతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి చందర్ రెడ్డి, అందూర్ సర్పంచ్ పృథ్వి చిలుకూరి రమేష్ రెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు






