ఖమ్మం సుడా చైర్మన్‌ను కలిసిన తల్లాడ కాంగ్రెస్ నేతలు
సత్తుపల్లి, తల్లాడ, మే 11 (విజయక్రాంతి): ఖమ్మం సుడా చైర్మన్ గా నియమితులైన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ని ఖమ్మం పట్టణంలో వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలుసుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసి పువాళ్ళ దుర్గాప్రసాద్ గారిని శాలువాతో సత్కరించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్, తల్లాడ మండలం మల్లవరం సర్పంచ్ కటికి కిరణ్ కుమార్, వారికి శుభాకాంక్షలు తెలియజేసిన వారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీను, కాపా మహేష్, జిల్లా కార్యదర్శి మర్సకట్ల బాబు, తల్లాడ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్య అంజయ్య, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు షేక్ జమాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.






