మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి
- సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ..
- చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేత.. మరో నలుగురు కూడా..
- పదవీకాలం ఐదేళ్లు.. రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్‌పర్సన్ కాకుండా, కమిషన్ సభ్యురాళ్లుగా మరో ఆరుగురు నియమితులయ్యారు.
సర్కార్ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన చాకలి ఐలమ్మ మనుమ రాలు చిట్యాల శ్వేతకు సభ్యురాలిగా అవకాశం కల్పించింది. మిగిలిన నలుగురు శశికళా యాదవ్‌రెడ్డి, సదా లక్ష్మి, ఎన్.రాధాబాయి, ఉజ్మ అశై షకీరా. చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు ఉంటుందని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మహిళా కమిషన్ సభ్యులు
మహిళా కమిషన్ చైర్‌పర్స న్‌గా గద్వాల విజయలక్ష్మి, సభ్యు లుగా కాసోజు శంకరమ్మ, చిట్యా ల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరా ఉన్నారు. వీరు ఐదేళ్ల పా టు పదవిలో కొనసాగుతారు.






