calender_icon.png 13 November, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణపూర్ రైస్ మిల్లులో ఇసుక డంప్పు స్వాధీనం

13-11-2025 11:43:41 AM

అక్రమంగా ఇసుక డప్పు చేస్తుండగా మైనింగ్ అధికారుల దాడి

 2 టిప్పర్లు ఒక తార్ వాహనం సీజ్ చేసిన మైనింగ్ ఏడి శ్రీనివాస్

సుల్తానాబాద్, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని రైస్ మిల్లులో(Narayanpur rice mill) అక్రమంగా డంపు చేసిన ఇసుక డంప్పును మైనింగ్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మానేరు సమీపంలో నుంచి రైస్ మిల్లులో టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక డప్పు చేస్తుండగా సమాచారం అందుకున్న మైనింగ్ ఏడి శ్రీనివాస్ తన సిబ్బందితో బుధవారం రాత్రి రైస్ మిల్లులో ఉన్న ఇసుక డంపును స్వాధీనం చేసుకుని, 2 టిప్పర్లు ఒక తార్ వాహనం ను సీజ్ చేసి పెద్దపల్లిలోని ఆర్టీవో కార్యాలయంకు తరలించారు.

ఈ సందర్భంగా ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పేదవారికోసం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, కానీ కొంతమంది మానేరు లో టిప్పర్లతో, ట్రాక్టర్లతో రాత్రి వేళలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, వారిపై నిఘా  పెట్టామని, నారాయణపూర్ లో ఇసుకను అక్రమ గడ్డంపు చేస్తున్నారని సమాచారం రాగా హుటాహుటిన తమ సిబ్బందితో వెళ్లి ఇసుక డంపును ఒక తార్ వాహనాన్ని రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నామని ఏడి తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరిక