9 May, 2026 | 12:42 PM

Breaking News

ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి   •   వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలి   •  

బెంగాల్ టైగర్స్ ఘన విజయం

22-01-2025 11:33 PM

హాకీ ఇండియా లీగ్...

రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌లో బెంగాల్ టైగర్స్ విజయాన్ని అందుకుంది. లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 2 ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌పై గెలుపొందింది. బెంగాల్ తరఫున ముల్లన్ (ఆట 21వ, 33వ ని.లో) గోల్స్ సాధించింది. ఈ విజయంతో బెంగాల్ టైగర్స్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉండగా.. సుర్మా క్లబ్, ఒడిశా వారియర్స్ తర్వాతి స్థానంలో ఉంది. పురుషుల హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సారధ్యంలోని సుర్మా హాకీ క్లబ్ మరో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌ను 1 సుర్మా క్లబ్ మట్టికరిపించింది. సుర్మా తరఫున హర్జీత్ సింగ్ (9వ ని.లో), గుర్జంత్ సింగ్ (17వ ని.లో) గోల్స్ అందించారు. ఢిల్లీ తరఫున కోరే వేయర్ (59వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో మహిళల విభాగంలో ఒడిశా వారియర్స్‌తో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్, పురుషుల విభాగంలో తమిళనాడు డ్రాగన్స్‌తో హైదరాబాద్ తుఫాన్స్ తలపడనున్నాయి.