26 July, 2026 | 1:47 AM

చినుకు కోసం రైతు నిరీక్షణ

26-07-2026 12:00 AM

పొగాకు నారుమడులకు ట్యాంకర్ నీళ్లు

అలంపూర్, జూలై 25: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో జోగులాంబ గద్వాల జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం మానవపాడు మండలం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన రైతు బోయ రఘుపతి నాయుడు తన పొగాకు నారుమడులు ఎండిపోకుండా ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి, బిందు సేద్యం తరహాలో స్ప్రింకర్లను ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారు. ‘వర్షాలు లేక నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి స్ప్రింకర్ల ద్వారా నారుమడులకు నీరందిస్తున్నాం’ అని రఘుపతి నాయుడు అన్నారు.