26 July, 2026 | 1:45 AM

చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల ధర్నా

26-07-2026 12:00 AM

ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు

ముషీరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శనివారం రాత్రి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఢిల్లీలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులను పరామర్శించిన రాహుల్‌గాంధీ.. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులపై విరిగిన లాఠీలకు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు.

నీట్ పేపర్ లీక్ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే, మరి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా మని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు కేవలం రాజకీ య పబ్బం కోసం మాత్రమే బయటికి వచ్చి మాట్లాడుతున్నారు తప్ప విద్యార్థులపై నిజమైన ప్రేమ వీరికి లేదన్నారు.

రెండు లక్షల ప్రభుత్వరెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీభర్తీ చేయాలని, మెగా డీఎస్సీ విడుదల చేయాలని, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచి, వయోపరిమితిని పెంచాలని, గ్రూప్స్, జేఎల్‌ఎం, ఇంజనీర్ పోస్టులకు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. శాంతియుత ధర్నా నిర్వహిస్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు నిరుద్యోగులకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. ధర్నా చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో  నిరుద్యోగ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, నరేష్, కిరణ్ ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిరుద్యోగులు  సవాయి సింగ్, సురేష్, గణేష్, సుప్రియ, నవీన ఉన్నారు.