6 August, 2026 | 1:35 AM

నిండు కుండల్లా చెరువులు!

06-08-2026 12:53 AM

4.21 కోట్ల చేప పిల్లల విడుదలకు రంగం

నేడు టెండర్లకు ఆహ్వానం

మత్స్యకారుల్లో చిగురిస్తున్న ఆశలు

నిర్మల్ ఆగస్టు 5 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎన్నో మొన్నటి వరకు బోసిపోయిన చెరువులు ప్రాజెక్టులు కుంటల్లో వరద నీరు వచ్చి చేరడంతో జలకల సంతరించుకున్నాయి. దీంతో చేప పిల్లల విడుదల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

100% సబ్సిడీతో సాగునీటి చెరువులు ప్రాజెక్టులలో చేప పిల్లల విడుదలకు ప్రభుత్వం తాజాగా రూ .116 కోట్ల నిధులను విడుదల చేస్తే ఆ జిల్లాలో చేప పిల్లల విడుదల పక్కన పై కార్యచరణ రూపొందించారు. జిల్లాలో చేప పిల్లల విడుదలకు బిల్డర్ నుండి నేడు టెండర్లకు ఆహ్వానించడం అధికారులు తెలిపారు.

నిర్మల్ జిల్లాలో 2026-27 సంవత్సరం గాను 4.21 కోట్ల చేప పిల్లలను విడుదల చేసినందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మత్స్ శాఖ యాక్షన్ ప్లాన్ తయారుచేసింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 557 చెరువులు ఉండగా 74 పెద్ద చెరువులు, ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 222 మత్స్య కార్మిక సంఘాలు ఉండగా 13825 మంది సభ్యులు చేపల వృత్తి జీవనాధారంగా బతుకుతున్నారు. పరోక్షంగా మరో కొందరికి మందికి చేప పిల్ల పెంపకం జీవనోపాధి కల్పించినట్టు అధికారులు చెప్తున్నారు.

జిల్లాలో 4.21 కోట్ల చేప పిల్లల కార్యచరణ 

నిర్మల్ జిల్లాలో 100% సబ్సిడీపై చేప పిల్లల పెంపకానికి జిల్లా యంత్రాంగం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. జిల్లాలో మొత్తం 557 చెరువులు ప్రాజెక్టులలో 4.21 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా గత వారం రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లాలోని చేపల పెంపకం చేపట్టే ప్రాజెక్టు చెరువులో పెద్ద ఎత్తున వరద రావడంతో నిండుకున్నాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్ అయిన శ్రీ రామ్ సాగర్, కడెం నారాయణరెడ్డి, స్వర్ణ, గడ్డన్న శుద్ధ వాగు, పాలసీ రంగారావుకర్ ప్రాజెక్ట్, సదర్ మార్ట్ ప్రాజెక్టు సాగునీటి చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయనున్నారు. 477 చిన్న చెరువుల్లో 35 నుంచి 40 గ్రాముల చేప పిల్లలను విడుదల చేయనుండగా ప్రాజెక్టులో 80 నుంచి 100 గ్రాముల చేప పిల్లలను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇందులో బొచ్చ, రవాట, రకం చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతి అచ్చిన వెంటనే టెండర్లు నిర్వహించి చేప పిల్లల ఉత్పత్తి యజమానులతో చేప పిల్లల విడుదల ప్రక్రియ చేపట్టే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఆగస్టు రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈనెల చివరన సెప్టెంబర్ మొదటిది వారంలో నిర్మల్ జిల్లాలో చేప పిల్లల విడుదల ప్రక్రియ పూర్తిచేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. చేప పిల్లలు విడుదల చేయడానికి సెప్టెంబర్ మాసం ఎంతో అనుకూలమైందని చెప్తున్నారు.

4.21లతో ప్రణాళిక 

నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన వ ర్షాల నేపథ్యం లో చేప పిల్లలు విడుదలకు ప్రభుత్వం ఇచ్చింది. జిల్లాలో మొత్తం 557 నీటి వనరుల్లో 4.21 చేప పిల్లలను విడుదల చేసినందుకు ప్రత్యేక కార్యచరణ రూ పొందించాం. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర అనుమతితో ఇప్పటికే చేప పిల్లల విడుదలపై కార్యచరణ రూపొందించి అమ లు చేసినందుకు చర్యలు తీసుకుంటు న్నాం. త్వరలో టెండర్లు పిలిచి చేప పిల్ల ల ప్రక్రియ పూర్తి చేస్తాం. జిల్లాలో ప్ర స్తుతం చెరువులు ప్రాజెక్టులో పుష్కలం గా నీరు ఉన్న నేపథ్యంలో చేప పిల్లలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వ అనుమతి రాగానే ఈ ప్రక్రియ మరింత వేగంగా నిర్వహిస్తాం.

అవినాష్ జిల్లా అధికారి