6 August, 2026 | 2:14 AM

హరీశ్.. దుష్ప్రచారం మానుకో

06-08-2026 12:00 AM
  1. కట్టు కథలతో బట్టకాల్చి మీద వేయడమే నీ పని 
  2. కాళేశ్వరం లెక్కలు చెప్పి మాట్లాడు 
  3. బీఆర్‌ఎస్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల, పట్టిసీమ పనులు
  4. ఏపీకి సహకరించి.. ఇప్పుడు విమర్శలా?
  5. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైర్
  6. నీటి హక్కులపై రాజీ లేదు  
  7. త్వరలో సమ్మక్క సాగర్‌కు ఎన్‌ఓసీ వస్తుందని స్పష్టీకరణ 

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి) : ‘కట్టు కథలతో సాగునీటి ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహార ంపై లెక్కలు చెప్పిన తర్వాతే విమర్శలు చేయాలి’ అని  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తెలం గాణ ప్రాజెక్టులను ఏపీ సర్కార్ 12 ఏళ్లుగా ప్రతి బోర్డు సమావేశాల్లో వ్యతిరేకిస్తుందని, ఇది కొత్త విషయం కాదని స్పష్టం చేశారు.

పీ ప్రాజెక్ట్‌లకు పరోక్షంగా సహకరించిన బీఆర్‌ఎస్ నేతలు.. అధికారం కోల్పోగానే బట్ట కాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నడూ తెలం గాణ ప్రయోజనాలను కాపాడలేదని, రాయ లసీమ ఎత్తిపోతల, పోలవరం, బనకచర్ల ప్రా జెక్టుల పనులు మొదలైంది మీ హయాం లోనే కాదా? అని మంత్రి ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల  మీరు అధికారంలో ఉండ గా పూర్తి కాలేదా? తెలంగాణ సొమ్ము ను లూటీచేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

ఈ నెల 18న జరిగే కేఆర్‌ఎంబీ మీటింగ్ ఎజెం డాలో చేర్చిన అంశాలు కొత్తవేమీ కావని.. ఇవే అంశాలను గత సమావేశాలు,  కరె స్పాండన్స్‌లలో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించి ందని వివరించారు. ఇవే అంశాలను సీతారా మ ఎత్తిపోతల పథకం క్లియరెన్స్ విషయం లోనూ ఏపీ  ప్రస్తావించగా, తెలంగాణ ప్ర భుత్వం ధీటుగా స్పందించిందన్నారు. వాస్త వాలను జీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకువెళ్లి  ఎస్‌ఎస్‌ఎంపీ,  టీఏసీ క్లియరెన్స్ సాధించినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు. 

ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌ఓసీ..

అంతర్‌రాష్ట్ర వ్యవవహారాల డైరెక్టరేట్ క్లియరెన్స్, ఐపీ క్లియరెన్స్ పొందడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, ఛత్తీస్‌గఢ్‌లోని ముంపు సమస్య పైన ఆ రాష్ట్రంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సం ప్రదింపులు జరపలేదని మంత్రి విమర్శిం చారు. తమ ప్రభుత్వం  సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఎన్‌ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని చాలాసార్లు సంప్రదించిందని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర సీఎంను మూడుసార్లు కలిసి విజ్ఞప్తి చేశామని, ఈ నెలాఖరులో ఎన్‌ఓసీ  ఇస్తా మని చెప్పారని మంత్రి వెల్లడించారు.

సీతమ్మసాగర్‌కు అనుమతులు సాధించాం

 సీతమ్మ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అభ్యంతరాలను  ప్రతిఘటించి 2025 ఏప్రిల్ 24న అనుమ తులు సాధించామని మంత్రి తెలిపారు. బీఆ ర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేయలేని పనిని తాము చేశాని, 67 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించామన్నారు. న్యాయ పరమైన చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్, ఐఏ వాజ్యాలు వేయడం జరిగిందని, ప్రతివాదులందరూ నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్పటికే ఆదేశాలు జారీ చేసిందని మంత్రితెలిపారు.

2018- 2022 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతానికి 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులను ఏపీ సర్కార్ చేపట్టగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితమైందన్నా రు. ఆర్డీఎస్‌లో నీళ్ల వాటా కోసం బీఆర్‌ఎస్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని, తమ ప్రభుత్వం ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో ఏపీ, కర్ణాటక సీఎం లను ఒప్పించినట్లు తెలిపారు.  

కవిత ఆరోపణలకు జవాబివ్వండి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందాయనే కవిత ఆరోపణలకు హరీశ్‌రావు సమాధానం చెప్పాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అ ముడుపుల్లో నీ వాటా ఎంతనో తేలాలన్నారు. తెలంగాణలో అధికారంలో రావడం లేదని ఏపీతో కుమ్మక్కై నాగార్జునసాగర్ ప్రాజెక్టును వివాదం చేసింది మీరు కాదా?, రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తావా? అని  మంత్రి మండిపడ్డారు. 

ఏపీ అభ్యంతరాలను దీటుగా ఎదుర్కొన్నాం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా  కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోది కుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వొద్దని జీఆ ర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, జలశక్తి మంత్రిత్వ శాఖను ఏపీ ప్రభుత్వం కోరుతూ వచ్చిం దని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఏపీ లెవ నెత్తిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొని తమ నీటి హక్కుల ను కాపాడడంలో సఫలీకృతమైందన్నా రు.  ఈ విషయలో గత బీఆర్‌ఎస్ ప్రభు త్వమే రెండు రాష్ట్రాల మధ్య నీటి ఒప్పం దం కుదరాలని, లేదంటే ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్‌కకుమార్‌రెడ్డి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం సమయస్పూ ర్తితో వ్యవహరించి ట్రిబ్యునల్ ఏర్పడకు ండా ఇప్పటివరకు  అడ్టుకుందని తెలిపారు.