15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తారక రామారావు చేసిన సేవలు మరువలేనివి

28-05-2025 08:16 PM

తాడ్వాయి (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ  నాయకులు  దేమి కమ్మరి రాజు(TDP Yella Reddy constituency leaders Demi Kammari Raju) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో బుధవారం టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజు మాట్లాడుతూ... ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు నందమూరి అని తెలిపారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకొని జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమ్రావు, కురుమ దత్తయ్య, బోయిని రాజు, కమ్మరి నర్సింహులు, గంగయ్య, కృష్ణ, చారి, ఎల్లయ్య, లింగం, రాజయ్య, అంజయ్య, కాశీరాం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.