28-05-2025 08:19:06 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో అమలు చేస్తున్న జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం(National Electronic Marketing Policy) పరిశీలించడానికి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం బుధవారం వచ్చింది. నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, పాలక మండలి సభ్యులు కేసముద్రం మార్కెట్ యార్డును సందర్శించి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల తీరును, ఎలక్ట్రానిక్ విధానం అమలు తీరును పరిశీలించారు. కేసముద్రం మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అమరలింగేశ్వరరావు మార్కెట్ పనితీరును వారికి వివరించారు.