19 August, 2026 | 1:01 AM

లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి

19-08-2026 12:00 AM

వనపర్తి టౌన్, ఆగస్టు 18 : వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వన మహోత్సవం, పంట మార్పిడి, పింఛన్ల దరఖాస్తులపై సమీక్షించారు.

జిల్లాలో ఇప్పటివరకు 60 శాతం మొక్కల నాటకం పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులను తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలని తెలిపారు. అర్హులు ఆగస్టు 31లోగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.