calender_icon.png 8 August, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగదేవ్‌పూర్ లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

08-08-2025 09:07:05 AM

జగదేవ్ పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల మేరకు జగదేవ్పూర్ మండలం పరిధిలో గల వివిధ పరిశ్రమలను, పెట్రోల్ పంపులను మండల టాస్క్ ఫోర్స్(Task force checks)  బృందం సంయుక్త తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా వ్యవసాయానికి వాడాల్సినటువంటి యూరియాను ఇతర పరిశ్రమ అవసరాలకు వాడుతున్నారన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్,  పోలీసు, రెవిన్యూ మరియు  వ్యవసాయ శాఖ అధికారులకు సంయుక్త తనిఖీలు నిర్వహించాల్సిందిగా  ఆదేశించిన నేపథ్యంలో జగదేపూర్ మండల పరిధిలోగల ఎరువుల షాపులు, పాల శీతలీకరణ కేంద్రాలు, పెట్రోల్  బంకులు, పాతర గడ్డి యూనిట్ లో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీ లలో ఎలాంటి వ్యవసాయ సంబంధం యూరియా వాడటం లేదని గుర్తించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ వ్యవసాయ అవసరాల నిమిత్తం మాత్రమే యూరియాను వాడుకోవాలని,  ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ గాని, పరిశ్రమల అవసరాలకు వాడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మండలంలో ఈరోజు కు 150 టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని, ఇప్పటికీ 610 టన్నులు పంపిణీ చేశామన్నారు.  రైతులు యూరియా గురించి ఆందోళన పడవద్దన్నారు.  తనిఖీలలో జగదేవ్పూర్ మండల తహసిల్దార్ నిర్మల, మండల వ్యవసాయ అధికారి వసంతరావు, జగదేవపూర్ ఎస్ ఐ కృష్ణారెడ్డి,  ఏఈవో ఖలీల్ పాల్గొన్నారు.