08-08-2025 10:51:38 AM
బోథ్,(విజయక్రాంతి): రాజ్ గోండ్ సేవా సమితి బోథ్ డివిజన్ అధ్యక్షులుగా దుర్వ విశ్వశ్వర్ రావ్ నియమితులయ్యారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా ఉయక లక్ష్మన్ లను రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు అధ్యక్షతన జరిగిన స్టీరింగ్ కమిటీ(Steering Committee) ఆధ్వర్యంలో నియామించారు. ఆదివాసీల ల అభివృద్ధి సమస్యల పరిష్కారానికి నూతన నాయకులు కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. అటు తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రాజ్ గోండ్ సేవాసమితి అభివృద్ధికి కృషి చేస్తానని విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ గొండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు పంద్రం శంకర్ తదితరులు ఉన్నారు.