08-08-2025 09:02:51 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో(Railway Station) గురువారం అర్ధరాత్రి నిలిపి ఉంచిన రైలు బోగిలో అగ్నిప్రమాదం చోటుచేసుకు పూర్తిగా దగ్ధమైంది. మూడవ రైల్వే లైన్ పనులకు కోసం ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో పనులు నిర్వహించడానికి ప్రత్యేకంగా రైలుబోగిని తెచ్చారు. రైల్వే స్టేషన్లోని నాల్గవ రైల్వే లైన్ లో ఆ బోగిని నిలిపి ఉంచారు. అ
ర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ సర్క్యూట్(Electric circuit) జరిగి మంటలు లేచాయి. వెంటనే అప్రమత్తమైన అందులో ఉన్న నలుగురు సిబ్బంది బయటకు వచ్చారు. అలాగే రైలు బోగి నిలిపి ఉంచిన పక్కనే రైల్వే క్వార్టర్స్ లో ఉన్న మరికొందరు కూడా వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన జరిగిన విషయం తెలుసుకున్న కేసముద్రం ఎస్ ఐ మురళీధర్ రాజ్ సంఘటనస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక యంత్రం రప్పించి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటన వల్ల రైల్వే శాఖకు సుమారు రెండు కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.