08-08-2025 11:42:44 AM
నకిరేకల్,(విజయక్రాంతి): తన కుటుంబ అవసరాల కోసం ఒక మహిళా కూలీ పనికి వచ్చి తోటి కూలీలను పలకరించి అందరు చూస్తుండగానే అనంత లోకాలకు వెళ్లిన హృదయ విచారక ఘటన శుక్రవారం నకిరేకల్(Nakrekal) పట్టణ లోని ఇందిరా గాంధీ సెంటర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చందుపట్ల తిరుపతమ్మ (45) సుతారి కూలీ పని కోసం నకిరేకల్ వస్తుంటాది రోజువారి లాగానే శుక్రవారం కూలీ పనికి వచ్చింది. ఆమే తోటి కార్మికులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి పడిపోయింది. తోటి కార్మికులు ఆమెను పరిశీలిస్తుంచగా. అప్పటికే ఆమె మృతి చెందింది.. గుండెపోటుతో మృతి చెందినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు.ఆమెకు భర్త, ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ మహిళలు శ్రావణ శుక్రవారం కావడంతో తన సౌభాగ్యాలు బాగుండాలని వరలక్ష్మి వ్రతం చేస్తుంటే. కానీ ఆమె మరణంతోఆ కుటుంబంలో విషాదఛాయలుఅలుముకున్నాయి. అందర్నీ కంటతడి పెట్టించింది.