08-08-2025 11:47:19 AM
ఎమ్మెల్యే సహకారంతో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం
మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : పట్టణంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్(Mahabubnagar Municipal Chairman) భరోసా ఇచ్చారు. గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించి కాలనీ వాసులతో మాట్లాడారు. వర్షం బాగా కురిసినప్పుడు ఎక్కడెక్కడ అత్యధికంగా నీరు నిలుస్తుందని, ఇలాంటి చర్యలు తీసుకుంటే మీకు ఉపయోగపడతాయని సమస్యలను ఆరా తీశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) దృష్టికి తీసుకుపోయి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని మీ ఇంటి దగ్గరికి వచ్చే చిత్త సేకరణ వాహనాలకు మాత్రమే తడి పొడి చెత్త వేరుగా ఇచ్చి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అందరం కలిసి పరిశుభ్రత వైపు అడుగులు వేస్తేనే మన లక్ష్యం నెరవేరుతుందని తెలియజేశారు. ఎవ్వరికి ఎలాంటి ఆపద ఉన్న తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉన్నారు.