08-08-2025 10:25:37 AM
హైదరాబాద్: ఆకాశానికి చిల్లుపడినట్లుగా హైదరాబాద్(Hyderabad rains) లో నిన్న కుండపోత వర్షం కురిసింది. దీంతో మణికొండ పుప్పాలగూడలో(Manikonda Puppalaguda) 35 అడుగుల గోడ కూలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలనికి శివాలయం రక్షణ గోడు కూలింది. దీంతో సమీపంలోని 3 ఇళ్ల ల్లోకి మట్టి కొట్టుకుపోయింది. ఇండ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్(Hyderabad) అతలాకుతలం అయింది. భారీ వర్షానికి హైదరాబాద్‌లో పలుప్రాంతాలు నీటమునిగాయి. ఎల్లారెడ్డిగూడ, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో 500కు పైగా బైకులు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోగా.. వందలాది ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు.