08-08-2025 11:49:42 AM
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం(Nangunur Mandal) పాలమాకుల సహకార బ్యాంకు వద్ద యూరియా కోసం రైతులు(Farmers) శుక్రవారం భారీగా బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ఎదురుచూసి, తమ అవసరాలకు తగిన యూరియాను పొందేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.ఇటీవలి యూరియా సరఫరాలో ఏర్పడిన కొరత దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, పాలమాకుల సహకార బ్యాంకు వద్ద యూరియా అందుబాటులోకి వచ్చిందని తెలియగానే, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు.ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.రైతులందరికీ సరిపడ యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.