29 April, 2026 | 3:22 AM

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి

29-04-2026 12:50 AM

10 మంది అరెస్ట్, 9 మంది పరారీ రూ.42,460 నగదు స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం/చంద్రుగొండ, ఏప్రిల్ 28, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలోని గుర్వాయగూడెం శివార్లలో అక్రమంగా నడుస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం మెరుపుదాడి చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రుగొండ పోలీసు స్టేషన్ పరిధిలోని గుర్వాయగూడెం అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు అకస్మాత్తుగా దాడి చేయగా, అక్కడ పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకోగా,09 మంది పారిపోయినట్లు ఇన్స్పెక్టర్ రమాకాంత్ తెలిపారు.

ఈ దాడిలో రూ.42460/- ల రూపాయల నగదుతో పాటు 09 సెల్ఫోన్లను,07 బైకులను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వారిని చంద్రుగొండ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ తెలిపారు.అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసుల చొరవను స్థానికులు అభినందించారు. చంద్రుగొండ పోలీసులు పేకాటలో పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసారు.