29 April, 2026 | 3:26 AM

గిరిజన గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

29-04-2026 12:51 AM

గరిడేపల్లి, ఏప్రిల్ 28: గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం ఆంజనేయం రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గారకుంట తండ గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ బానోతు అరుణ రమేష్ నాయక్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.గ్రామంలోని ప్రధానమైన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో గరిడేపల్లి మాజీ సర్పంచ్ బానోతు సైదా నాయక్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సురభి సైదులు, ఉపసర్పంచ్ గౌతమి సుధాకర్,వార్డు సభ్యులు జలంధర్,జయరాం,ఝాన్సీ,గ్రామ పెద్దలు బాలు,భంగి,దేవ్లా తదితరులు పాల్గొన్నారు.