8 August, 2026 | 1:13 AM

కాచిగూడలో టాస్క్‌ఫోర్స్ దాడులు

08-08-2026 12:00 AM

60 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం

ముషీరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): కాచిగూడ కమేళాలో హెచ్-ఫాస్ట్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 60 కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన మాంసాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుల్ వినయ్తో కలిసి కమేళాకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కిలోల కుళ్లిన మాంసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ మాంసాన్ని ఎవరూ వినియోగించకుండా ఉండేందుకు దానిపై ఫినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన మాంసాన్ని నిల్వ ఉంచిన యజమాని అఖ్పి కేసు నమోదు చేసి చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.