బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మలకు బోనం సమర్పించిన కోట నీలిమ
సికింద్రాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆషాఢ బోనా ల మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోట నీలిమ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా అర్చకులు నీలిమకు ఆశీర్వచనం అం దించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
అనంతరం నీలిమ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగ నిర్వహణకు రూ.20కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో భక్తులకు ఇబ్బందులు కలగకుం డా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయంతో పాటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సహా నగరంలోని అ న్ని ఆలయాల్లో బోనాల జాతర, రంగం వైభవంగా నిర్వహించబడినట్లు ఆమె తెలిపారు.






