8 August, 2026 | 1:16 AM

ఫీజు రీయింబర్స్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

08-08-2026 12:00 AM

బీజేపీ పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి డిమాండ్

బాన్సువాడ, ఆగస్టు 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఫీజు రీయింబర్స్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలంటూ బిజెపి, బిజెవైఎం ఆధ్వర్యంలో ఫీజు బకాయి... బిజెపి లడాయి యొక్క పోస్టర్లను శుక్రవారం బాన్సువాడ రేణుక ఒకేషనల్ కాలేజీలో ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల యొక్క ఫీజు రీయింబర్స్  మరియు స్కాలర్షిప్ బకాయిలు రాష్ట్రంలో 15వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇవ్వవలసి ఉందని రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్లపై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు

బిఆర్‌ఎస్ గవర్నమెంట్ విద్యార్థులు మోసం చేసి అధికారం చేపట్టింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు అన్ని విడుదల చేస్తామని ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో ఈరోజు లక్షలాదిమంది విద్యార్థులు స్కాలర్షిప్లు రాక విద్యను మధ్యలో ఆపేయడం జరుగుతుంది చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు రాక రోడ్ల పైన తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వెంటనే పెండింగ్లో ఉన్న పదిహేను వేల కోట్ల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని ఇంజనీరింగ్ విద్యార్థులు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలని లేనిచో విద్యార్థులచే పెద్దతన ఉద్యమాలు చేసి స్కాలర్షిప్లు అచ్చేంత వరకు విద్యార్థులచే ఉద్యమాలు చేపడతామని కొరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ బిజెపి నాయకులు భాషా భాస్కర్ రెడ్డి చీకటరాజు ఉమేష్ అశ్విన్ పురుషోత్తం సచిన్ నరేష్ పద్మ నరేష్ మహేందర్ తదితరు పాల్గొన్నారు.