12 August, 2026 | 8:53 AM

విత్తన దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు

19-06-2024 12:05 AM

కామారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాల బెడదపై ‘విజయక్రాంతి’ దినపత్రికలో ఈ నెల 10న వచ్చిన కథనానికి జిల్లా వ్యవసాయ అధికారులు స్పం దించారు. మంగళవారం బిచ్కుం ద, బీర్కూర్, బాన్సువాడ మండలాలలో టాస్క్‌ఫోర్స్ అధికారులు విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. రైతులకు రశీదులు ఇవ్వకుండా ఖాళీ పేపర్‌పై బిల్లులు రాసి ఇస్తున్న విషయంపై డీలర్లను ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసి, బిల్లులు ఇస్తున్నట్టు డీలర్లు అధికారులకు తెలిపారు. ఎవరైనా ఖాళీ పేపర్‌పై బిల్లులు ఇస్తే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని బాన్సువాడ ఏడీఏ లక్ష్మిప్రసన్న రైతుల కు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విత్తన దుకాణాల యజమానులు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. తనిఖీల్లో వ్యవసాయ అధికారి రాజలింగం తదితరులు పాల్గొన్నారు.