జీడీపీ వృద్ధి 7 శాతంపైనే..
ఎన్‌సీఏఈఆర్ అంచనా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: భారత్ ఆర్థికాభివృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతాన్ని మించుతుందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) అంచనా వేసింది. అంతర్జాతీయ వృద్ధి, వాణిజ్యం పెరుగుతుందని, రుతుపవనాలు సగటుకంటే అధికంగానే ఉంటా యన్న అంచనాల ప్రకారం భారత్ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం దాటుతుందని ఎన్‌సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా వివరించారు.
2024 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును ఇటీవల ఐఎంఎఫ్ 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి రేటు 7.6 శాతం. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కనపర్చిన వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనసాగిస్తుందని తాజాగా ఎన్‌సీఈఏఆర్ విడుదల చేసిన ఏప్రీల్ నెల సమీక్ష పేర్కొంది.






