భారతీయ ఉత్పత్తులపైనా పన్ను!
ప్రపంచ పెద్దన్నగా చెప్పుకోబడుతున్న అమెరికన్ 47వ అధ్య క్షునిగా జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వచ్చీ రాగానే ప్రపంచ నలువైపులా చూశా రు. బేసిక్‌గా వ్యాపార వర్గానికి చెందిన ట్రంప్ సాధారణ పరిపాలన విధానం కంటే వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపై మొదట దృష్టి పెట్టారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ( డబ్ల్యూటీవో)నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. డబ్ల్యూటీవో లో ప్రపంచ దేశాలన్నిటికీ సభ్యత్వం ఉన్నప్పటికీ దానికి అధిక భాగం నిధులు సమకూర్చేది అమెరికా యే. ఇప్పడు అమెరికా దానినుంచి వైదొలగడం వల్ల సంస్థ పై, దాని సభ్య దేశాలపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
విజయవంతమైన బహుపాక్షిక సంస్థ
అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, యూఎస్ వ్యాపార సంఘం చాలా కాలంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ని అత్యంత విజయవంతమైన బహుపాక్షిక సంస్థలలో ఒకటిగా పరిగణించింది. గ్లోబల్ రూల్స్-బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ అది. మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చింది.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) 1995లో సృష్టించబడినప్పటికీ, ఇది 1947లో సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (జీఏఏటీ) ఆధారంగా నిర్మించబడింది . డబ్ల్యూటీవో, జీఏఏటీ (గాట్)ప్రపంచ వాణిజ్యాన్ని విప్లవాత్మకంగా మార్చాయి.
ఎనిమిది విజయవంతమైన బహుపాక్షిక చర్చల రౌండ్లు ప్రపంచ వాణిజ్యాన్ని 1948లో ఉన్న 58 బిలియన్ల నుండి నేడు 25 ట్రిలియన్లకు పెంచడంలో సహాయపడ్డాయి. వాస్తవ పరంగా ఈ 40 రెట్లు పెరుగుదల దాదాపు మొత్తం ప్రపంచానికి వాణిజ్యపరమైన ఆటుపోట్లనూ తీసుకువచ్చింది.
నేటి సమాజంలో ప్రపంచీకరణ కొనసాగుతున్నందున, వాణిజ్య వ్యవస్థలను నిర్వహించడానికి అంతర్జాతీయ సంస్థ ఆవశ్యకత చాలా ముఖ్యమైనది. వాణిజ్య పరి మాణం పెరిగేకొద్దీ, ప్రతి దేశం వాణిజ్య నియమాలలో తేడాల కారణంగా రక్షణవాదం, వాణిజ్య అడ్డంకులు, సబ్సిడీలు, మేధోసంపత్తి ఉల్లంఘన వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. డబ్ల్యూటీవోను ప్రపంచీకరణ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు. డబ్ల్యూటీవో ఆర్థిక పరిశోధన , విశ్లేషణకు కేంద్రంగా కూడా ఉంది.
భారత్‌లో ప్రపంచీకరణ ప్రభావం
భారతదేశంలో ఆర్థిక సరళీకరణ అనేది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరవడానికి ఉద్దేశించిన విధాన మార్పుల శ్రేణిని సూచిస్తుంది. ఇది మరింత మార్కెట్ -ఆధారితంగా వినియోగం -ఆధారితంగా మార్చే లక్ష్యం. 1966లో ,1980ల ప్రారంభంలో కొన్ని సరళీకరణ ప్రయత్నాలు జరిగినప్పటికీ, 1991లో మరింత సమగ్రమైన సర ళీకరణ ప్రారంభమైంది.
సరళీకరణ ప్రక్రి య తీవ్ర మాంద్యం, సోవియట్ యూనియన్ రద్దుకు దారితీసిన చెల్లింపుల సమ తుల్యత సంక్షోభం కారణంగా అమెరికాను ఏకైక సూపర్ పవర్‌గా వదిలేయడంతోపాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందేందుకు అవసరమైన నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమాలను నెరవేర్చాల్సిన అవసరం ఏర్పడింది.
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటివి ఇలాంటి వే.1991లో ఏర్పడిన సంక్షోభం ఎల్‌పీజీ సంస్కరణలుగా పేర్కొనబడే సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ సహా మరింత సమగ్రమైన ఆర్థిక సంస్కరణల అజెండాను ప్రారంభించడానికి ప్రభుత్వానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది.
సంస్కరణలను ప్రారంభించిన మన్మోహన్ సింగ్ 1991 జూలై 24 తనబడ్జెట్ ప్రవేశ ప్రసంగంలో‘ ప్రపంచమంతా బిగ్గరగా, స్పష్టంగా విననివ్వండి. భారతదేశం ఇప్పుడు మేల్కొని ఉంది’ అని అన్నారు.
సంస్కరణల లాభనష్టాలు
సంస్కరణ ప్రక్రియ భారతీయ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను చూపింది., ఇది విదేశీ పెట్టుబడుల పెరుగుదలకు దారితీసింది, మరింత సేవల ఆధా రిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లింది. వివిధ రంగాలు, సామాజిక సమూహాలపై భారతదేశ ఆర్థిక సరళీకరణ విధానాల ప్రభా వం చర్చనీయాంశంగా ఉంది.
ఈ విధానాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లో వజయం సాధించినప్పటికీ , కొందరు వాటి ప్రతికూల పరిణామాల గురించి ఆం దోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు జనాభా అంతటా సమానంగా పంపిణీ చేయబడనందున ఆదాయ అసమానతలు, సామాజిక అసమానతలను విస్తృతం చేయడానికి విధానాలు దోహ దం చేశాయని కొందరు విమర్శకులు వా దించారు.
ఈ సంస్కరణల్లో దిగుమతి సుంకాలను తగ్గించడం, మార్కెట్లను నియంత్రించడం, పన్నులను తగ్గించడం వంటివి ఉన్నాయి. ఇది విదేశీ పెట్టుబడుల పెరుగుదలకు, అధిక ఆర్థిక వృద్ధికి దారితీసింది. 1992 నుండి 2005 వరకు, విదేశీ పెట్టుబడులు 316.9శాతం పెరిగాయి.
భారతదేశ జీడీపీ 1991లో ఉన్న 266 బిలియన్ల నుండి 2018లో 2.3 ట్రిలియన డాలర్లకు పెరిగింది. ఒక అధ్యయనం ప్రకా రం, మొత్తం మీద వేతనాలు పెరిగాయి, అత్యంత పేదరికం 1993-94లో 36 శాతం నుండి 1999-2000 నాటికి 24.1 శాతానికి తగ్గింది.
అయితే సరళీకరణ విధానాలు ఆదా య అసమానతలను పెంచుతున్నాయని, సంపదను కేంద్రీకరిస్తున్నాయని, గ్రామీణ జీవన ప్రమాణాలు అధ్వాన్నంగా ఉన్నాయని, నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు పెరగడానికి కారణమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి.
భారతదేశం కూడా తన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఎక్కువగా ఏకీకృతం చేసింది. ఏదేమైనా సరళీకరణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా ప్రయోజనం కలిగించలే దు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాం తాలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయి.
1997 నాటికి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను సంస్కరించడం, వ్యవసాయ రాయితీ లను తగ్గించడం వంటి వివాదాస్పద అం శాలపై కార్మిక సంఘాలు , రైతులను లెక్కలోకి తీసుకోకుండా తప్పించుకున్నప్పటికీ, ఏ పాలక కూటమి కూడా సరళీకరణను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించలేదని స్పష్టమైంది.
21వ శతాబ్దం నాటికి ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర నియంత్రణలో గణనీయమైన తగ్గింపు ,పెరిగిన ఆర్థిక సరళీకరణతో భారతదేశం మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైపు పురోగమించింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఈ మార్పులను మెచ్చుకుంది.
ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-,ఎనేబుల్ సేవల ఎగుమతులతో అవుట్‌పుట్ వేగంగా పెరిగింది. 2006లో భారతదేశం అత్యధిక జీడీపీ వృద్ధి రేటు 9.6శాతం నమోదు చేసి ప్రపంచంలో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ట్రంప్ నిర్ణయం ప్రభావం
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం తమ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను సభ్య దేశాలలో ఏ మూలకైనా వెళ్లి అమ్ముకునే విధంగా అవకాశం ఉంటుంది. డబ్ల్యూటీవో బైలాస్ కూడా ఇదే. అయితే జనవరి 20న అమెరికా 47వ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తాను అనుకున్నంత పని చేశారు.
ఇతర దేశాల నుండి తమ దేశానికి వచ్చి వ్యాపారం చేసుకునే వస్తువులపై సుంకాన్ని విధించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కెనడా, చైనా, మరికొన్ని దేశాలపై పది నుండి 25 శాతం పన్ను విధించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
అయితే ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ గా చెప్పుకోబడుతున్న భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై కూడా పన్ను విధించే అవకాశం లేకపోలేదు. గతంలో అనేకసార్లు ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై దిగుమతి పన్ను విధించనున్నట్లు పేర్కొన్నారు.
కాబట్టి అమెరికాతో భారత్ మైత్రీ సంబంధాన్ని నెలకొల్పుకున్నప్పటికీ భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకం వేస్తే ఉత్పత్తిదా రులకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు. ట్రంప్ అధికారం చేపట్టగానే డబ్ల్యూటీవో నుండి,
పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన ప్యారిస్ ఒప్పందం నుం డి వైదొలగడం అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ప్రపంచ అగ్రనేతలు గమనించాల్సి ఉంటుంది.






