calender_icon.png 7 August, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకిశాల ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి..

30-11-2024 08:49:56 PM

న్యాయవాది మమ్మద్ ఫజల్ ఉర్ రహమాన్ డిమాండ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): సుంకిశాల ఘటనకు బాధ్యులైన అసలైన అధికారులను సస్పెండ్ చేయాలని న్యాయవాది మమ్మద్ ఫజల్ ఉర్ రహమాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ.. గతంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినట్టుగా సుంకిశాలలో ప్రాజెక్ట్ అవసరం లేకున్నా మెగా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కాంట్రాక్టులతో అధికారులు కుముక్కై ప్రణాళిక లేకుండా నాసిరకంతో కట్టడంతొ రిటర్నింగ్ వాల్ కూలిపోయిందన్నారు. ప్రారంభంలో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వ్యయం 14 వందల కోట్లు కాగా రెండు సంవత్సరాల లోపు 22 వందల కోట్లు అంటే ఎనిమిది వందల కోట్ల వ్యయం ఏవిధంగా పెరిగిందని ప్రశ్నించారు. అంత వ్యయాన్ని వెచ్చించినప్పటికీ  కూలిపోవడం ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

టర్నల్ కూలిపోయినా విషయం 5 రోజుల వరకు ఎండి అశోక్ రెడ్డికి తెలియకపోవడం, డైరెక్టర్ రవికుమార్ 5 రోజులు తరువాత రిపోర్ట్ చేయడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. ఎండి అశోక్ రెడ్డి, డైరెక్టర్ పి. రవికుమార్, సీజీఎండి సుదర్శన్ ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీజిఎం కిరణ్ కుమార్, ఇటీవల చార్జ్ తీసుకున్న, రాజ్ జిఎం, ప్రశాంత్ డీజిఎం, హరీష్ మేనేజర్ ను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. శ్రీశైలంలో పని పూర్తి చేసిన తర్వాతనే సుంకిశాల పునర్నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ పనిని నీటిపారుదల శాఖకు అప్పజెప్పాలన్నారు. ఈ విషయంపై 18 అక్టోబర్ 2024 న మున్సిపల్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంఎయుడి కి నోటీసులు సర్వ్ చేయడం జరిగిందని, ఇప్పుటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఈ శాఖకి మంత్రిగా ఉన్నందున సీఎం చొరవచూపి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసారు.