calender_icon.png 2 December, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థులు అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ ఎల్లయ్య

02-12-2025 11:12:46 AM

చిన్న చింతకుంట: సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారం కోసం పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టుకోవడానికి, ర్యాలీలు నిర్వహించ డానికి, మైకులు పెట్టుకోవడానికి  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మండల తహసీల్దార్‌ ఎల్లయ్య(Tahsildar Ellaiah) తెలిపారు. పోలింగ్‌ పరిసమాప్తం కావ డానికి నిర్ణయించిన సమయానికి ముందు 44 గంటల నుండి బహిరంగ సభలను నిర్వహించటం, ఊరేగింపులు చేయడం నిషిద్ధమన్నారు.

అనుమతి పొందిన బహిరంగ సమావే శాలు,రోడ్‌ షో ల వద్ద లౌడ్‌ స్పీకర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలన్నారు. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే పోలీస్‌ అధికారులు లౌడ్‌ స్పీకర్‌ లను జప్తు చేయడానికి అధికారం కలిగి ఉంటారని పేర్కొన్నారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులు గ్రామ పంచాయతీ పరిధిలో తమ ప్రచారానికి ఒక వాహనాన్ని ఉపయోగించడానికి అనుమతి ఇస్తారని తెలిపారు. అభ్యర్థులు ప్రచారానికి వినియోగించేందుకు ప్రతిపాదించిన వాహనాల వివరాలను  ముందుగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. వార్డు సభ్యుని పదవికి పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం ఎలాంటి వాహ నాన్ని ఉపయోగించకూడదని వివరించారు.

పోలింగ్‌ రోజున వాహనాల వినియోగం...

పోలింగ్‌ రోజున గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఒక వాహనాన్ని ఉపయోగించేందుకు మాత్రమే అనుమతిస్తారని,పోలింగ్‌ రోజున ఇతర వాహ నాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని చెప్పారు. వార్డు విస్తీర్ణం చాలా తక్కువ ఉంటుందని, వార్డు మెంబర్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు వాహన అనుమతి ఉండదన్నారు.నిర్ణిత నమూనాలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు మాత్రమే వాహన పర్మిట్లను జారీ చేస్తారని చెప్పారు. వాహన పర్మిట్‌ అసలు ప్రతి వాహనం ముందు వైపు అద్దంపై అభ్యర్థులు అతికించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని రాజకీయ పార్టీల నేతలు ప్రజలు సహకరించాలని తెలిపారు.